TSPSC Paper Leak: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీలో దర్యాప్తు ముమ్మరం

TSPSC Paper Leak: మిగతా నిందితుల కస్టడీ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా

Update: 2023-03-26 02:01 GMT

TSPSC Paper Leak: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీలో దర్యాప్తు ముమ్మరం

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఏ1 నిందితుడు ప్రవీణ్‌తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్‌, ఏ5 కేతావత్‌ రాజేశ్వర్‌లను కస్టడీకి అప్పగించింది. మిగతా ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకెళ్లడానికి పిటిషన్ దాఖలు చేసింది. ఏ1 నిందితుడు ప్రవీణ్‌తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్‌, ఏ5 కేతావత్‌ రాజేశ్వర్‌లను కస్టడీ కి ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది

నలుగురు నిందితులను ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సిట్‌ అధికారులు విచారించనున్నారు. మిగతా ముగ్గురు నిందితులు ఏ-10, ఏ-11, ఏ-12ల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.సిట్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసు కస్టడీలో నిందితులు ఎలాంటి సమాచారం తెలపలేదని కోర్టుకు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఉన్ నిందితులు నోరు విప్పడం లేదన్నారు. కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పారని, మిగతావారి పాత్ర బయటపడాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పేపర్‌ లీకేజీకి ఉపయోగించిన పరికరాలపై నిందితులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు.

రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను కస్టడీ కి ఇవ్వాలని సిట్ కోరింది. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం పొందిన షమీమ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 127 మార్కులు, టీఎస్‌పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్‌ బృందం గుర్తించింది. లీకేజీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం తీసుకున్నట్లు షమీమ్‌ తెలిపాడు. దీనికోసం డబ్బులేమీ తీసుకోలేదని చెప్పాడు. దీంతో షమీమ్‌ ఇచ్చిన ఆధారాల మేరకు వీరిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ కి ఇవ్వాలని సిట్ పిటిషన్ వేయగా కేసు విచారణను కోర్టు కు సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News