TSPSC: TSPSC ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డికి రేపు నోటీసులు ఇచ్చే అవకాశం
TSPSC: TSPSC ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సిట్
TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి రేపు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలో TSPSC ఛైర్మన్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ప్రవీణ్ డిస్ క్వాలిఫై కావడంతో అనుమానం రాలేదన్నారు సెక్రటరీ. లింగారెడ్డి తన PA రమేష్ గ్రూప్-1 రాసినట్టు తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. సిట్... ఇద్దరినీ వేరు వేరుగా రెండు గంటల పాటు విచారించింది. మొత్తం పరీక్షల నిర్వహణ, కాన్ఫిడేన్షియల్ పై వివరాలను సిట్ అధికారులు రాబట్టారు. ఈ కేసులో ఇవాళ్టితో ముగ్గురు నిందితులకు కస్టడీ ముగియనుంది.