TSRTC: ఆర్టీసీ బస్‌లో మహిళకు టికెట్‌ కొట్టిన కండక్టర్‌.. స్పందించిన ఉన్నతాధికారులు

TSRTC: నిజామాబాద్ నుండి బోధన్ వెళ్తున్న ఆర్డినరి బస్సులో మహిళకు టికెట్ ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది.

Update: 2023-12-10 12:07 GMT

TSRTC: ఆర్టీసీ బస్‌లో మహిళకు టికెట్‌ కొట్టిన కండక్టర్‌.. స్పందించిన ఉన్నతాధికారులు

TSRTC: నిజామాబాద్ నుండి బోధన్ వెళ్తున్న ఆర్డినరి బస్సులో మహిళకు టికెట్ ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఆర్టీసీ బస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రభుత్వం పథకం ప్రారంభించిన రెండో రోజే.. ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి టికెట్ ఇవ్వడం ఏంటిని మహిళ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. అయితే.. టికెట్ ఇష‌్యూ చేసిన తర్వాత టికెట్ క్యాన్సల్ చేయటం కుదరని కండక్టర్ చెప్పడంతో.. ఇద్దరి మధ‌్య వాగ్వాదం జరిగింది.

కాగా.. వాగ్వాద దృశ్యాలను వీడియో తీసిన మహిళ కుటుంబసభ్యులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. కాగా.. ట్విట్టర్‌లో కండక్టర్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Tags:    

Similar News