TS EAMCET 2021: ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంది
TS EAMCET 2021: ఈనెల 4 నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని కన్వీనర్ గోవర్ధన్ స్పష్టం చేశారు.
TS EAMCET 2021: ఈనెల 4 నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని కన్వీనర్ గోవర్ధన్ స్పష్టం చేశారు. అందుకుగానూ తెలంగాణలో 82 సెంటర్లు ఏపీలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని పేర్కొన్నారు.
రెండు గంటల ముందే పరీక్ష హాల్‌లోకి అనుమతి ఇస్తారని ఒక నిమిషం ఆలస్యమైన అనుమతి లేదన్నారు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్. హాల్ టికెట్‌పై లొకేషన్ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని అన్నారు. ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని, గతంలో వెయిటేజి ఉండేదని కానీ ఇప్పుడు లేదని తెలిపారు. కోవిడ్‌తో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.