KTR Birthday: మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యేలు
KTR Birthday: మంత్రి కేటీఅర్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు
KTR Birthday: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అందులో కొందరు కేటీఆర్ బర్త్ డే సందర్బంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు, మరికొంత మంది వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
మంత్రి కేటీఆర్‌కు వినూత్నంగా బర్త్‌డే విషెస్ చెప్పిన యం.ఏ ముజీబ్:
మంత్రి కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలను వెరైటీగా చెప్పారు కేటీఆర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు యం.ఏ ముజీబ్. ఒడిశాలోని పూరిలో సముద్ర తీరాన ఇసుక తిన్నెల్లో కేటీఆర్ చిత్ర పటాన్ని వేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అద్భుతంగా ఉన్న ఈ బొమ్మ ఎంతోమందిని ఆకర్షిస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు యం.ఏ ముజీబ్.
మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్:
ఐటీ మినిస్టర్ కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు ఆయన. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్‌కు బర్త్‌డే విషస్ తెలియజేశారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రతి డివిజన్‌లో మొక్కలు నాటుతున్నామన్నారు.
మొక్కలు నాటుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య:
మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. నవాబుపేట, శంకర్ పల్లిలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మొక్కలు నాటుతున్నారు.
దివ్యాంగుడికి త్రిచక్ర వాహనం అందజేసిన మంత్రి తలసాని:
ఐటీ మినిస్టర్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవా కార్యక్రమం చేపట్టారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద దివ్యాంగుడికి త్రిచక్ర వాహనాన్ని అందజేశారు. మారేడ్‌పల్లిలోని తన ఇంటి దగ్గర కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
వికాలాంగులకు సైకిళ్లను అందజేసినా ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ కార్పొరేటర్:
మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్ద నర్సింహాయాదవ్. కేటీఆర్ సూచన మేరకు కూకట్ పల్లి నియోజవర్గ పరిధిలోని వికాలాంగులకు సైకిళ్లను అందజేశారు. అదేవిధంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులతో దూసుకెళ్తున్న మంత్రి కేటీఆర్ ఉన్నత పదవులు ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఆయన. నియోజకవర్గ ప్రజలు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని పెంపొందించేందుకు దోహదపడాలని కోరారు కార్పొరేటర్ ముద్ద నర్సింహాయాదవ్.
పాలపిట్ట పార్క్‌లో నాటిన మంత్రి హరీష్ రావు:
తెలంగాణలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. పాలపిట్ట పార్క్‌లో మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఎస్‌ఎఫ్‌డిసి చైర్మన్ ఒంటెరు ప్రతాప్ రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.