మేయర్ ఎన్నిక: టీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది?

Update: 2021-01-24 01:30 GMT

మేయర్ ఎన్నిక: టీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది?


జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై సస్పెస్ వీడింది. ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈసీ మూహుర్తం ఖరారు చేసింది. దీంతో రెండు నెలల నిరిక్షణకు తెరపడింది. ఇంతకీ అనుకున్నంత సంఖ్య బలం లేని టీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండుబోతుంది? మేయర్ ఎన్నిక ఎలా జరగబోతుంది.

ఎట్టకేలకు జీహెచ్ఎంసీ మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తో పాటు విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనరు, జిహెచ్ఎంసి పరిధిలోని ఓ జిల్లా కలెక్టరు ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిగా నియమించింది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11 వ తేదీ ఉదయం 11.00 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసి కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 లకు జరుగు ప్రత్యేక సమావేశములో మొదట మేయర్ ఎన్నిక తర్వాత ఉపమేయర్ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిని పరిశీలకునిగా నియమిస్తుంది.

జీహెచ్‌ఎంసీ 150 డివిజన్లు ఉండగా టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, మజ్లిస్‌-44, కాంగ్రెస్‌-2 స్థానాలు ఉన్నాయి. ఎక్స్‌-అఫిషియోలతో కలిపి పార్టీల బలాబలాలను పరిశీలిస్తే. కాంగ్రెస్ కు ఇద్దరు కార్పొరేటర్లు, ఒక ఎక్స్‌-అఫిషియోతో కలిపి మూడు ఓట్లు ఉంటాయి. బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌-అఫిషియోలతో కలిపి వారి బలం 51 ఉంది. బీజేపీకి మేయర్ సీటు దక్కాలంటే ౧౨౭ సభ్యుల మద్దతు ఉండాలి. అంతటి బలం బీజేపీకి మేయర్ ఛాన్స్ లేదు. మజ్లి్‌స్ కు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌-అఫిషియోలతో కలిపి మొత్తం బలం 54. టీఆర్‌ఎస్ కు 55 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 35 మంది దాకా ఎక్స్‌-అఫిషియో సభ్యులు ఉన్నారు. దీంతో టీఆర్ ఎస్ బలం 90 ఉంది.

మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచినవారు ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నిక ప్రక్రియను మొదలుపెడతారు. ఉదాహరణకు ఎక్స్‌అఫీషియోలు, కార్పొరేటర్లు కలిపి 200 మంది ఉంటే కనీసంగా వందమంది హాజరైతేనే ప్రత్యేక అధికారి సమావేశాన్ని నిర్వహిస్తారు.

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లతోపాటు, ఎక్స్‌అఫీషియో సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు. దీనిప్రకారం హాజరైన మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది మద్దతు ఉన్నపార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకుంటుంది. ఈ రెండు పదవులు టీఆర్ ఎస్ కే దక్కే అవకాశం ఉండడంతో ఆ పార్టీలోని పలువురు ఆశావహులు అధిష్టానం వద్ద తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News