నేడు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

Update: 2020-12-16 06:58 GMT

వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వ వివాదంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అతనికి భారత పౌరసత్వం లేదంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై మరోసారి వాదనలు జరుగనున్నాయి. భారత పౌరుడు కానీ వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికవడాన్ని తప్పుపట్టిన ఆది శ్రీనివాస్‌ హోంశాఖ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతున్నాడు. రిట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న సమయంలో జర్మనీ పాస్‌పోర్టుతో చెన్నమనేని జర్మనీకి వెళ్లారని ఇదివరకే హైకోర్టులో తెలిపారు ఆదిశ్రీనివాస్‌. అదేవిధంగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టులో కేంద్ర హోంశాఖ, చెన్నమనేని హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయనున్నారు.

Tags:    

Similar News