MLC Posts: ఎమ్మెల్సీ రేసులో ఛాన్స్ ఎవరికి.. అభ్యర్థుల ఎంపికపై..

MLC Posts: టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ పదవుల బొనాంజా నడుస్తోంది.

Update: 2021-11-12 07:23 GMT

MLC Posts: ఎమ్మెల్సీ రేసులో ఛాన్స్ ఎవరికి.. అభ్యర్థుల ఎంపికపై..

MLC Posts: టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ పదవుల బొనాంజా నడుస్తోంది. ఏకంగా 19 స్థానాలు ఖాళీ కావడంతో పార్టీలో ఆశావహుల సందడి కనిపిస్తోంది. ఈసారి దకక్కపోతే ఇక ఎప్పుడు దక్కనట్లేనని భావిస్తున్నారు నేతలు. పార్టీ ముఖ్య నాయకులు ఎక్కడకి వెళ్తే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ కళ్ళలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్ధికంగా బలమైన నేతలు లోకల్ బాడీ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 19 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే కోటాలో ఆరు, లోకల్ బాడీ కోటాలో 12, గవర్నర్ కోటాలో ఒక స్థానానికి అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే, లోకల్ బాడీ కోటాకు చెందిన నోటిఫికేషన్‌లు కూడా వచ్చాయి. మొత్తం 19 సీట్లు టీఆర్ఎస్‌కే దక్కనుండటంతో ఆశావాహులంత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు మూడు రోజుల్లోనే ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలోని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో ఆశావహుల ప్రగతి భవన్, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. రీసెంట్‌గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మకు సీఎం కేసీఆర్ వెళ్తే ఆయన కంట పడేందుకు ఆశవహులంత పరుగులు పెట్టారు. సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం లేకున్నా దూరం నుంచి పలుకరించెందుకు పోటీ పడ్డారు. మంత్రి కెటిఆర్ కామారెడ్డి పర్యటనకు వెళ్తే అక్కడ కూడా ఆశావహుల సందడి కనిపించింది. కొందరైతే ఆయా జిల్లాల మంత్రులతో లాబియింగ్ చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు చుట్టూ చాలా మంది ఆశావహులు తిరుగుతున్నారు.

లోకల్ బాడీ కన్నా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్టుకే ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు. Zptc, ఎంపీటీసీలను మచ్చిక చేసుకోవడం కొంత ఖర్చుతో కూడుకున్న పని కావడం, అంత చేసినా గెలుపు కోసం చివరి వరకు ఎదురుచూసే టెన్షన్ తప్పదని నేతలు భావిస్తున్నారు. ఈ టెన్షన్ కన్నా ఎమ్మెల్యే కోటా అయితే నయా పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయిపోవచ్చని నేతలు భావిస్తున్నారట. అందుకే మొదటి లిస్ట్ లోనే తమ పేరు వస్తే టెన్షన్ ఉండదని భావిస్తున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిన కవిత కూడా ఈ సారి ఏ కోటాలో వస్తారోనని అక్కడినేతలు భవిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటాలో పదవి కాలం ముగుస్తున్న నేతల్లో ఒకరిద్దరు నేతలకు తప్ప మిగతా స్థానాలకు కొత్త వాళ్ళకే అవకాశం దక్కవచ్చనే చర్చ పార్టీలో జరుగుతోంది. హుజూరాబాద్ ఓటమితో వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉండవచ్చేనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు ప్రగతి భవన్ నుంచి ఎవరికి సమాచారం ఇవ్వకపోవడంతో కేసీఆర్ జాబితాలో ఎవరు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆర్దికంగా బలమైన నేతలు లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటు ఖర్చు ఎంతైన భరిస్తామని లాబీయింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈనెల 15న నామినేషన్ వేయించేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News