పీవీ నర్సింహారావు 16వ వర్దంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద పీవీ నర్సింహారావు కు హోమ్ మంత్రి మహమూద్ అలీ,స్పీకర్ పోచారం,మండలి చైర్మన్ గుత్తా,
రాజ్యసభ ఎంపీ,పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేకే , ఎమ్మెల్సి కవిత నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు పీవీ నరసింహారావును గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.
పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్
16వ వర్ధంతి సందర్భంగా పీవీ నర్సింహారావు కు నివాళులు..పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి..వారు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి..శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయు..దేశానికి దిక్సూచి పీవీ..ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం..
గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్..
దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు..భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చున గొప్ప మహనీయుడు పీవీ..శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయన కు మనం ఇచ్చే ఘనమైన నివాలు..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న..
కేకే ఎంపీ
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పెద్ద ఎత్తున పీవీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్..పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు,దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది..పీవీ భారత రత్న ఇవ్వాలని ఎన్ ఆర్ ఐ కోరుతోంది..మేము కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భారత రత్న ఇవ్వాలని ఒక తీర్మానం కేంద్రానికి చేసి పంపుతాం..పీవీ పేరుతో ఒక స్టాంప్ ఇవ్వాలని కోరుతున్నాం