కారును పోలిన గుర్తులు.. ఈసీని కలిసిన టీఆర్ఎస్‌ నాయకులు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధితో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల గుర్తులపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Update: 2020-11-16 10:01 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధితో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల గుర్తులపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గుర్తును పోలిన గుర్తులు అనేకమున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కారును పోలిన రోటీ మేకర్ గుర్తు వల్ల మా అభ్యర్థి ఓడిపోయారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు పునారావృతం అయ్యాయని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాంటి గుర్తులు ఉంటే తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు దుబ్బాక ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసిన బండారు నాగరాజుకి రోటీ మేకర్ గుర్తును ఇచ్చారు అధికారులు. దాదాపుగా ఆ అభ్యర్ధికి ఏకంగా నాలుగువేలకి పైగా ఓట్లు రావడం గమనార్హం. 

Tags:    

Similar News