రెండోసారి టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : టీఆర్ఎస్ అభ్యర్థులు
తమపై నమ్మకంతో రెండోసారి టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామని గచ్చిబౌలి, మాదాపూర్, హఫీజ్ పేట్, కొండాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థులు తెలిపారు.
తమపై నమ్మకంతో రెండోసారి టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామని గచ్చిబౌలి, మాదాపూర్, హఫీజ్ పేట్, కొండాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థులు తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల మళ్లీ గెలుస్తామని సాయిబాబా, జగదీశ్వర్ గౌడ్, పూజిత, హమీద్ పటేల్ ధీమా వ్యక్తంచేశారు. డివిజన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పేరుకపోయిన సమస్యలను ఈ ఐదేళ్లలో పరిష్కరించామని టీఆర్ఎస్ అభ్యర్థులు గుర్తుచేశారు.
ఇటు తమ అభిమాన నాయకులకు టికెట్ రావడంతో వారి అనచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇక నిన్న టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ అభ్యుర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 105 మంది అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం రిలీజ్ చేసింది. ముందుగా ప్రకటించినట్టే అధికశాతం సిట్టింగ్‌లకే అవకాశం కల్పించింది. ఇక ఈరోజు అభ్యర్థులందరికీ బీ-ఫారాలను కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది.
అటు ఇవాళ టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన 45 డివిజన్లపై ఆచితూచి అడుగులు వేస్తోంది టీఆర్‌ఎస్. దీంతో రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టికెట్ దక్కని నాయకులు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.