గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్

గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన గులాబీ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లాలని గులాబీ నేతలు భావిస్తున్నారు.

Update: 2021-01-18 03:57 GMT
ప్రతీకాత్మక చిత్రం 

గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన గులాబీ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇంతకూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపు కోసం ఎలాంటి వ్యూహ రచన చేస్తున్నారు..? వాచ్ దిజ్ స్టోరీ.

తెలంగాణ శాసనమండలిలో రెండు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతాయి. ఆ రెండింటినీ తమ ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అవుతోంది టీఆర్ఎస్. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గులాబీ ఖాతాలో వేసుకోనే ప్రయత్నంలో భాగంగా సరికొత్త ప్యూహానికి తెర లేపుతోంది గులాబీ పార్టీ. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్యూహంపై కీలక నేతలతో చర్చించారు.

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు కోసం ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీలోని యూత్‌కు ఎక్కువ ప్రియార్టీ ఇవ్వాలని నేతలకు సూచించారు కేటీఆర్. ఇక.. ఖమ్మం వరంగల్ నల్గొండ స్థానంలో అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంతో ప్యూహాలకు పదును పెడుతుంది గులాబీ దళం. ఈస్థానం నుంచి టీజేఎస్ చీఫ్ కోదండరాం,తీన్మార్ మల్లన్న,రాణి రుద్రమ బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎస్టీ సామాజిక వర్గ అభ్యర్ధి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కోదండరాంకి కాంగ్రెస్ మద్దతిస్తే ఇక్కడ టగ్ ఆఫ్ వార్‌కి అవకాశం ఉండేది. ఎవరికి వారు ఉమ్మడి అభ్యర్ధిని నిలపడంతో ఫైనల్‌గా తమకే లాభం చేకురుతుందని లెక్కలేస్తుంది అధికార టీఆర్ఎస్.

మరోవైపు.. హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి జిల్లా అభ్యర్ది పై టీఆర్ఎస్ ఇంకా తుది నిర్ణయానికి రానట్లు తెలుస్తుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ వామపక్షాల అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితిని బట్టి నాగేశ్వర్ కి మద్దతిచ్చే విషయం పై ఆలోచిస్తుంది టీఆర్ఎస్. మరి గులాబీ పార్టీ వ్యూహాలు ఈ సారైనా వర్కౌట్ అవుతాయో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News