ఆదివాసీలను వెంటాడుతున్న సమస్యలు

Update: 2020-10-27 04:28 GMT

అభివృద్ధికి ఏమాత్రం నోచుకోక సభ్య సమాజానికి దూరంగా జీవిస్తున్న గిరిజనులు, ఆదివాసీలు దశాబ్దాల తరబడి పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. గ్రామాల్లో గిరిజనులకు మౌలిక సౌకర్యాలు ఏర్పడటం లేదు. గిరిజన సమస్య పరిష్కారానికి దిక్సూచీగా నిలువాల్సిన పాలకవర్గ సమావేశం పడకవేసింది. దీంతో పాలకులెందరు మారినా వారి బతుకులు మారడం లేదు.

మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా నాగరిక సమాజానికి ఆమడ దూరంలో ఉండే గిరిజనులను సమగ్రంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు సుమారు 35 ఏళ్ల క్రితం ఐటిడిఎ ఏర్పడింది. అయినా వారి బతుకుల్లో పూర్తి స్థాయి కాంతి రేఖలు ప్రసరించడం లేదు. ఈ పాలకమండలిలో ప్రజల చేత ఎన్నికైనా ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. నిబంధన ప్రకారం మూడు నెలలకోసారి ఐటిడిఎ సమావేశం నిర్వహించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి. అయితే ఏడాది గడుస్తున్న సమావేశం నిర్వహించలేదు. దీంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాలక మండలి సమావేశం నిర్వహించకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేపట్టారు. మరోవైపు పోడు భూములకు హక్కులు లభించడం లేదని, సాగు చేసిన పంటను అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ ప్రాంతాలకు రవాణా, వైద్య, విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినడాని`కి నెట్‌ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నీంటికి పరిష్కారం చూపే పాలకమండలి సమావేశం నిర్వహించకపోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా గిరిజన సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని, పలు శాఖల్లో పెరుకుపోతున్న అలసత్వాన్ని, అవినీతిని నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News