Jyothi: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్
Jyothi: ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు.
Jyothi: ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. జ్యోతిని చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మరోవైపు.. రిమాండ్ ఆపాలని జ్యోతి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని కోర్టుకు ఆయన తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నాకే రిమాండ్ విధించినట్టు జ్యోతి తరఫు న్యాయవాదికి న్యాయమూర్తి తెలిపారు. అనంతరం.. జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు జ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో జ్యోతి అనారోగ్యానికి గురికాగా.. ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 30 గంటల పర్యవేక్షణ అనంతరం.. వైద్య పరీక్షలు నిర్వహించగా.. రిపోర్ట్ నార్మల్ రావడంతో ఆమెను ఏఎంసీ వార్డు నుంచి డిశ్చార్జ్ చేశారు ఉస్మానియా వైద్యులు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం.. నాంపల్లి ఏసీబీ కోర్టులో జ్యోతిని హాజరుపరచగా.. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు.