Nirmal: బాసరలో విషాదం.. గోదావరిలో దూకి తల్లీ, ఇద్దరు చిన్నారులు సూసైడ్
Nirmal: ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకిన తల్లి
Nirmal: నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలతో తల్లి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు నిజామాబాద్‌కు చెందిన మానస, కుమారుడు బాలాదిత్య, కుమార్తె భవ్యశ్రీగా గుర్తించారు. నిజామాబాద్ నుంచి వచ్చి గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత ఈతగాళ్లను రంగంలోకి దింపి మృతదేహాలను బయటకు తీసి విచారణ చేపట్టారు. నిజామబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో తల్లి మానస పనిచేస్తున్నట్లు సమాచారం.