భార్యతో గొడవ పడి.. ఇద్దరు పిల్లలకు విషం
Mahabubabad: చికిత్స పొందుతూ రెండేళ్ల బాలుడు మృతి.. మరో బాలుడి పరిస్థితి విషమం
Mahabubabad: కన్నతండ్రే కాల యముడిగా మారాడు. కుటుంబ కలహాలతో చిన్నారులను కడతేర్చాలని చూశాడు. మహబూబాబాద్ మండలం ఆమనగల్లు శివారు బలరాం తండాలో చోటుచేసుకుంది. నిన్న భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో రమేశ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు రమేశ్. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు కలిపి భోజనం పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను ఆస్పత్రిలో చేర్చి.. పరారయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండేళ్ల బాలుడు మృతి చెందగా.. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.