దిగి వచ్చిన టమాటా ధరలు

Tomato Price Reduce : టమాటా ధరలు ఒక్కోసారి ఆకాశాన్నంటినా మరో సారి పాతాళానికి దిగివస్తాయి.

Update: 2020-08-06 12:30 GMT
ప్రతీకాత్మక చిత్రం

Tomato Price Reduce : ప్రతి వంటలో గృహిణులు ఎక్కువగా టమాటాలను వేస్తూ వుంటారు. అయితే ఈ టమాటా ధరలు ఒక్కోసారి ఆకాశాన్నంటినా మరో సారి పాతాళానికి దిగుతాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి. మొన్నటి వరకు ఆకాశాన్నంటిన టమాటా ధరలు అమాంతం కిందికి దిగుతున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.60 ధర పలికిన టమాటా ధరలు ఇప్పుడు 20రూపాయలకు పడిపోయింది. కూరగాయల్లో అత్యధికంగా వినియోగంలో ఉండే టమాటో ధరలు మొన్నిటి వరకు ఆకాశాన్నంటి ఉండడంతో నగరవాసులు, మధ్య తరగతి కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు నగరం చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోని గ్రామాల్లో ఈ సారి టమాట పంలను అధికంగా వేసారు. తెల్లవారితే వారంతా పంటను హైదరాబాద్ నగరంలోని మార్కెట్లకు పంపిస్తారు. దీంతో ధరలు అమాంతం తగ్గిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం రైతులు టమాటా సాగు చేయడంతో ఆగస్టు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మార్కెట్లో టమాటాలను ఎలాంటి కొదువ ఉండదని, సాగు ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. అంతే కాక ఓ వైపు నీటి సౌకర్యం కూడా ఎక్కువగానే ఉండడంతో వచ్చే వేసవి ప్రారంభం వరకు అన్ని రకాల కూరగాయలు, ప్రత్యేకంగా టమాటో ఎక్కువగా దిగుమతులు ఉంటాయని, ధరలు కూడా అంతగా పెరగవని మార్కెట్ వర్గాలు, రైతులు పేర్కొంటున్నారు.

ఈ టమాటా ధరలు వేసవికాలంలో పెరగక వర్షాకాలం ప్రారంభం నుంచి అమాంతంగా పెరిగాయి. దీనికి అసలైన కారణం శివారు జిల్లాలో టమాటా పంటలు వేయక దిగుబడులు రాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతుల చేసుకున్నారు. దీంతో ధరలు పెరిగినట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.



Tags:    

Similar News