Tomato Price: రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న టమోటా ధరలు
Tomato Price: మొన్నటి వరకు కిలో పది రూపాయలు. * ఒక్కసారిగా నాలుగైదు రూపాయలకు చేరుకున్న టమాటో ధర
Tomato Price: రైతు చెమట చుక్కకు విలువ కరువైంది. అన్నదాత శ్రమకు ఫలితం శూన్యమైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కన్నీరు పెడుతున్నాడు రైతన్న తాజాగా టమాటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఒక్కసారిగా ధర భారీగా పడిపోవడంతో టమాటా రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మొన్నటి వరకు కిలో 10 రూపాయలు పలికిన ధర ఒక్కసారిగా 4 నుంచి 5 రూపాయలకు పడిపోయింది. దీంతో పండించిన పంట మొత్తాన్ని ట్రాక్టర్‌తో దున్నేసి ధ్వంసం చేశాడు ఓ రైతు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్‌లో సదయ్య అనే రైతు తనకున్న రెండెకరాల్లో టమాటా పంటను సాగు చేశాడు. పంట దిగుబడి బాగానే వచ్చింది. కానీ, గిట్టుబాటు ధర కరువైంది. కిలో టమాటా ధర 4 నుంచి 5 రూపాయల కంటే ఎక్కువ ధర పలకడం లేదు. కూలీలు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదన్న ఆవేదనతో పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు సదయ్య. వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ఎలా ఉందో కూరగాయల పంటలకు కూడా అదేవిధంగా మద్దతు ధర కల్పించాలని సదయ్య వేడుకుంటున్నాడు.