Ponguleti: ఇవాళ పొంగులేటి కీలక సమావేశం
Ponguleti: 10 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పొంగులేటి సమావేశం
Ponguleti: కాంగ్రెస్‌లో పొంగులేటి చేరిక దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించిన పొంగులేటి కాంగ్రెస్ గూటికే వెళ్లాలని డిసైడ్ అయినట్లు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇవాళ మరోసారి 10 నియోజకవర్గాల ముఖ్య అనుచరులతో పొంగులేటి మరో దఫా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీలో చేరికపై పొంగులేటి స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి... సభ వేదికపైనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28న సభ నిర్వహించేందుకు సన్నహాలు సైతం ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తొలి నుంచి పొంగులేటిని చేర్చుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నించినా.. పొంగులేటి మాత్రం కాంగ్రెస్ గూటికే చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అనుచరగణం హస్తం తీర్థాన్నే పుచ్చుకోవాలని సూచించడంతో... ఆదిశగా పొంగులేటి అడుగులు వేస్తున్నట్లు ఖమ్మంలో చర్చ జరుగుతోంది. అయితే పొంగులేటి డిమాండ్లు ఏంటి..? కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకు ఏ హామీలు ఇచ్చిందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పొంగులేటి చేరికతో ఖమ్మంలో హస్తం గాలి వీస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఇవాళ పొంగులేటి మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.