కరోనా కాటు, వరద పోటుతో కళ తప్పిన దసరా
దసరా అంటేనే ఆటపాటలు, పిండివంటలతో సందడి వాతావరణం గుర్తొస్తుంది. అయితే ఈ దసరా మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి సందడీలేకుండానే జరుగుతోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు వరదలతో పండుగ రూపురేఖలే మారిపోయాయి.
దసరా అంటేనే ఆటపాటలు, పిండివంటలతో సందడి వాతావరణం గుర్తొస్తుంది. అయితే ఈ దసరా మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి సందడీలేకుండానే జరుగుతోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు వరదలతో పండుగ రూపురేఖలే మారిపోయాయి. మరోవైపు కరోనాతో కొలువులు కోల్పోయిన చాలామంది పరిస్థితి పూట గడిస్తే చాలు అన్నట్లుగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో తెలంగాణలో పెద్ద పండుగైన దసరా కళ తప్పింది. అటు షాపుల యజమానులు కూడా కొనేవాళ్లు లేక తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు.
దసరా పండుగంటేనే పిండివంటలకు ప్రత్యేకం అయితే ఈసారి మాత్రం పిండి వంటలు చేయాలన్నా.. నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకోవాలన్నా భారంగా మారింది. భారీగా పెరిగి పోయిన ధరలు ప్రధాన కారణంగా ఈ దసరా కాస్ట్లీ పండుగగా మారిపోయింది. దీంతో భాగ్యనగర వాసులు పండుగంటేనే దిగాలుపడిపోతున్నారు.అటు నాన్ వెజ్ ప్రియులకు, దుకాణదారులకు కూడా ఈ దసరా నిరాసనే మిగిల్చింది. ప్రస్తుత అన్ లాక్ సమయంలో కాస్తో కూస్తో దాచుకున్నది కూబా వరదల పాలవ్వడంతో నాన్ వెజ్ కొనే పరిస్థితి లేదని వినియోగదారులంటుంటే.. కొనేవాళ్లు లేక తీవ్ర నష్టాల పాలవుతున్నామని షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కరోనాకు తోడు వరదలు నగరాన్ని అతలాకుతలం చేయడంతో ఈ ఏడాది దసరా పూర్తిగా కళ తప్పింది. పండుగ సమయంలో రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రస్తుతం లాక్ డౌన్ కాలాన్ని గుర్తు చేస్తున్నాయి.