Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది
Kishan Reddy: గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే.. ఇప్పుడు కూల్చివేతలు చేస్తోంది
Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు..? విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు కిషన్‌రెడ్డి.