Satyavathi Rathod: యువత ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
* Satyavathi Rathod: యువత సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
Satyavathi Rathod: యువత ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యువత సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మనోవిజ్ఞాన యాత్ర నిర్వహించి అవగాహన కల్పించడం గొప్ప విషయమని అన్నారు. మానసిక ఆరోగ్యం, సాంకేతిక అవగాహన, సైబర్ అవేర్‌నెస్ , యువత సాధికారతపై మనో విజ్ఞాన యాత్ర నిర్వహించి 55వేల కుటుంబాలను ప్రభావితం చేసిన టీమ్‌ను మంత్రి అభినందించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనో విజ్ఞాన యాత్ర ముగింపు వేడుకకు సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ జగన్మోహన్ రావు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మనో విజ్ఝాన యాత్ర టీమ్ సభ్యులు పాల్గొన్నారు.