MLC Kavitha: ఈడీ కేసులో తీర్పును మే 6కు వాయిదా
MLC Kavitha: బెయిల్ ఇవ్వవద్దని వాదనలు వినిపించిన దర్యాప్తు సంస్థలు
MLC Kavitha: మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌లపై తీర్పును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ మద్యం కేసులో కవిత బెయిల్‌పై తీర్పును మే 2వ తేదీన... ఈడీ కేసులో తీర్పును మే 6వ తేదీన ఇవ్వనుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ సంస్థలు కోర్టు ఎదుట సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈడీ తరఫు న్యాయవాది దాదాపు రెండు గంటల పాటు బెయిల్ ఇవ్వవద్దని వాదనలు వినిపించారు. ఏప్రిల్ 26వ తేదీలోగా కవిత తరఫు న్యాయవాదులు రిజాయిండర్ దాఖలు చేయనున్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదనలో పస లేదని, మద్యం కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణ సంస్థలు కోర్టులో వాదనలు వినిపించాయి.