Medchal Train Accident: ఘోరం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
Medchal Train Accident: మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు.
Medchal Train Accident: మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం కావడంతో తన ఇద్దరు కూతుర్లను తీసుకొని వచ్చాడు. తన కుమార్తెలిద్దరు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్న సమయంలో రైలు రావడాన్ని గమనించిన కృష్ణ వారిని కాపాడబోయే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే రైలు వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో కృష్ణతో పాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో రాఘవేంద్రనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.