Telangana: టీకా సెంటర్లను భారీగా పెంచనున్న తెలంగాణ సర్కార్

Telangana: తెలంగాణలో టీకా సెంటర్లను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2021-04-26 05:51 GMT

Telangana: టీకా సెంటర్లను భారీగా పెంచనున్న తెలంగాణ సర్కార్

Telangana: తెలంగాణలో టీకా సెంటర్లను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీకి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్‌లో అపార్ట్‌మెంట్స్‌, కమ్యూనిటీ హాళ్లల్లో టీకాను పంపిణి చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోనున్నారు. 1400 టీకా పంపిణీ కేంద్రాలను 4 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంది. రోజుకు 5 లక్షల టీకాలు వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. జనవరి మూడో వారంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు 40 లక్షల మందికి టీకాలు వేశారు. మరో వారం రోజుల్లో మూడోదశ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1473 కేంద్రాలు ఉండగా 1219 ప్రభుత్వ కేంద్రాలు, 254 ప్రైవేట్ కేంద్రాలు ఉన్నాయి. 

Tags:    

Similar News