Telangana: ప్రభుత్వం భూములు విక్రయించేందుకు హెచ్ఎండీఏ మరో దఫా సిద్ధం
Telangana: బహదూర్‌పల్లి, తొర్రూరులో ప్లాట్ల ఈ-వేలాని రంగం సిద్ధం
Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధం అయింది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు వేలం వేసిన భూములతో పాటు మరికొన్ని ఫ్లాట్లను HMDA వేలం వేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న బహదూర్ పల్లిలోని ప్లాట్లను ఆన్లైన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ MSTC ఆధ్వర్యంలో వేలం.. ఈ - ఆక్షన్ ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సన్నాహాలు పూర్తి చేసింది. మల్టీ పర్పస్ జోన్ కింద ఉన్న ఈ రెండు లే అవుట్లను HMDA ఎండిఏ పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నది.
బహదూర్‌పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్‌లో 223 పాట్లను ఈ - ఆక్షన్ ద్వారా మార్చి మూడో వారంలో విక్రయించబోతున్నారు. గతంలో ఉప్పల్ భాగాయత్‌లో ప్లాట్లను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి భారీ లాభం వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని బహదూర్ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి ఇవాళ ప్రీ బిడ్ మీటింగ్ జరుగనున్నది. బహదూర్‌పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రీ బిడ్ మీటింగ్ ప్రారంభం కానున్నది.
రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌లో 117 ఎకరాల విస్తీర్ణంలో HMDA లే అవుట్‌ను అభివృద్ధి చేస్తుంది. అందులోని 223 ప్లాట్లను ఈ - ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి ప్రీ బిడ్ మీటింగ్ శుక్రవారం తోర్రూర్ సైట్లోనే నిర్వహించనున్నారు. గతంలో కోకాపెట్లో నిర్వహించిన వేలంలో ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. ఆ స్థాయిలో కాకున్నా బహదూర్‌పల్లి, తొర్రూరులో జరిగే వేలంలో కూడా ఎక్కువ ధరలు పలికే అవకాశం ఉంది.