Ration Card: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈకేవైసీ అప్‌డేట్ చివరి తేదీపై మంత్రి గంగుల గుడ్‌న్యూస్.. ఏమన్నారంటే?

Ration Card: బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేసే ప్రక్రియ తెలంగాణ రాష్టంలో మొదలైంది.

Update: 2023-09-29 10:31 GMT

Ration Card: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈకేవైసీ అప్‌డేట్ చివరి తేదీపై మంత్రి గంగుల గుడ్‌న్యూస్.. ఏమన్నారంటే?

Ration Card: బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేసే ప్రక్రియ తెలంగాణ రాష్టంలో మొదలైంది. ఈ క్రమంలో చేపట్టిన రేషన్ ఈకేవైసీ జోరుగా సాగుతోంది. అయితే, కొన్నిచోట్ల ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారంతా ఈ కేవైసీ పూర్తి చేసేందుకు రేషన్ షాప్‌ల బాట పడుతున్నారు. అయితే, సెప్టెంబర్ 30 వరకే చివరి తేదీ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో రేషన్ షాపువల వద్ద క్యూ లైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే, ప్రభుత్వం తరపున ఎటువంటి సమాచారం లేకపోవడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాప్‌ల్లో బయోమెట్రిక్ సక్రమంగా పనిచేయకపోవడంతో చాలామంది ఆధార్ కేంద్రాల బాట పడుతున్నారు.

5 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సిందే. దీంతోనే అసలు సమస్య మొదలైంది. ఈకేవైసీకి వేలిముద్రలు తప్పనిసరి కావడంతో సమీపంలోని ఆధార్ కేంద్రాలకు వెళ్తున్నారు.

అయితే, వేలిముద్రలు అప్ డేట్ చేసిన తర్వాత 90 రోజుల సమయం పడుతుంది. కానీ, రేషన్ ఈ కేవైసీ చేసేందుకు ఎక్కువ సమయం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇటు రేషన్ షాపులు, అటు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ విధానంపై విమర్ళలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ప్రజల ఇబ్బందుల మేరకు ఓ గుడ్ న్యూస్ అందించారు. ఈ కేవైసీకి లాస్ట్ డేట్ లేదంటూ చెప్పుకొచ్చారు. చాలామంది తెలంగాణ ప్రాంత ప్రజలు దుబాయ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి, ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడామని, కేవైసీకి ఇంకా సమయం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ మంత్రి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News