Seethakka: మహిళలు, పిల్లలు స్వేచ్ఛగా జీవించేలా పోలీస్ శాఖ పని చేస్తుంది

Seethakka: HICCలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సదస్సు

Update: 2024-08-29 11:16 GMT

Seethakka: మహిళలు, పిల్లలు స్వేచ్ఛగా జీవించేలా పోలీస్ శాఖ పని చేస్తుంది

Seethakka: మానవ అక్రమ రవాణా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు హైదరాబాద్‌ HICCలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, డీజీపీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ, సైబరాబాద్ సీపీ పాల్గొన్నారు. తెలంగాణలో మహిళలు, పిల్లలు స్వేచ్ఛగా జీవించేలా పోలీస్ శాఖ పని చేస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహిళల పట్ల చిన్నచూపు కొనసాగుతుండటమే హత్యలు, అత్యాచారాలకు కారణం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. శిక్ష, శిక్షణ రెండూ ఏకకాలంలో జరిగితే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. మహిళలను సెక్స్ సింబల్‌గా చూసే ధోరణి పోవాలన్నారు. అందుకే పాఠశాలల నుంచి పిల్లలకి అవగాహన కల్పిస్తున్నాం అన్నారు మంత్రి సీతక్క.

Tags:    

Similar News