Seethakka: కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్‌

Seethakka: బతుకమ్మ మొదటి రోజే మహిళలపై కేటీఆర్ మాటలు దురదృష్టకరం

Update: 2024-10-02 10:56 GMT
Minister Seethakka fires on KTR

Seethakka: కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్‌

  • whatsapp icon

Seethakka: కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మహిళలను అవమానించారని అన్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నాడన్నారు. తమ నోళ్లను పినాయిల్ తో కడగాలని.. మాట్లాడిన కుసంస్కారి కేటీఆరని...ఆయన నోటినే యాసిడ్ తో కడగాలన్నారు. మహిళల బ్రేక్ డాన్సులంటూ గతంలో కేటీఆర్ కామెంట్ చేశారని...మహిళలను కించపర్చడం ఆయనకు పరిపాటిగా మారిందని అన్నారు. తానెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని...కేటీఆర్ కు మహిళలే సరైన బుద్ధి చెబుతారని మంత్రి సీతక్క కేటీఆర్ కామెంట్స్ కు కౌంటరిచ్చారు.

Tags:    

Similar News