Dasara Gift: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దసరా కానుకగా అదిరిపోయే గిఫ్ట్
Dasara Gift: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులకు దసరా కానుక ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
Dasara Gift: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే కానుక అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతోషిస్తున్నారు. దసరా పండగ కానుకగా పాయిమాయిల్ రైతులకు ఈ గుడ్ న్యూస్ చెప్పారు.
పామాయిల్ గెలల ధరను రూ. 17,043గా నిర్ణయించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై స్పందించారు. పామాయిల్ రైతులకు ముందుగానే దసరా పండుగ వచ్చిందని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు భారీగా మేలు జరుగుతుందన్నారు.
పామాయిల్ సాగును లాభసాటిగా మార్చి..కొత్త రైతులను ప్రోత్సహించాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. దీంతోపాటుగా ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచాలని కేంద్రానికి మంత్రి విజ్నప్తి చేసినట్లు తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఖరీఫ్ సీజన్ నుంచే ఈ బోనస్ అమలు చేయనున్నారు. దీంతోపాటుగా రైతు భరోసా నిధులను దసరా లోపు రైతుల అకౌంట్లో జమ చేయాలన్న కార్యాచరణ చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.