ఈ అడవితల్లి బిడ్డలు 16 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటేశారు...

ఈ అడవితల్లి బిడ్డలు 16 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటేశారు...

Update: 2024-05-13 09:21 GMT

ఈ అడవితల్లి బిడ్డలు 16 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటేశారు...

ఉన్న ఊరిలో ఓటేసేందుకు కొందరికి బద్ధకం. మరికొందరు పోలింగ్ నేను హాలిడే భావించి.. టూర్లకు వెళ్లే చదువుకున్న అజ్ఞానులను చూశాం. కానీ వారు అక్షరాస్యులు కాకపోయినా ఓటు ప్రాధాన్యత తెలుసు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా ఓటు విలువను గుర్తించి ఏకంగా 16 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటేశారు. ఓటును ప్రాణంగా భావించే అడవి బిడ్డలు కొండలను, కోనలను దాటుకుంటూ తమ ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గిరిజన ప్రజలు. కొండల మధ్య ఉన్న పెనుగోలు గ్రామస్థులు.. సరిగ్గా రోడ్డు మార్గం లేకపోయినా జంగాలపల్లిలోని పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లి ఓటేశారు. మాకు ఓటంటే ప్రాణం అని నిరూపించుకున్నారు.

Tags:    

Similar News