బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య కొనసాగుతున్న పరస్పర సవాళ్లు

Hyderabad: కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పైలట్ రోహిత్ రెడ్డి

Update: 2022-12-18 05:52 GMT

బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య కొనసాగుతున్న పరస్పర సవాళ్లు

Hyderabad:  హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి మరికాసేపట్లో పైలట్ రోహిత్ రెడ్డి రానున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పర ఆరోపణలు సవాళ్లు కొనసాగుతున్నాయి. నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్‌కి వచ్చి పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ చేశారు. బెంగళూరు డ్రగ్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని రోహిత్ ప్రకటించారు. తనపై ఆరోపణలు చేసిన బండి ఆధారాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తడిబట్టలతో అమ్మ వారి ఎదుట ప్రమాణం చేద్దామని బండి సంజయ్‌కి పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్‌లో రోహిత్‌రెడ్డి తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించాడని, రోహిత్‌రెడ్డి విద్యార్హతలపై ఈసీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. రోహిత్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని రఘునందన్ రావు ఈసీని కోరారు.

Tags:    

Similar News