Dowleswaram Barrage: కొనసాగుతున్న వరద ఉధృతి.. 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిదాటి ప్రవహిస్తున్న గోదావరి

Dowleswaram Barrage: సహాయక చర్యల్లో పాల్గొంటున్న 4 ఎన్డీఆర్‌ఎఫ్‌, 6 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Update: 2023-07-29 09:30 GMT

Dowleswaram Barrage: కొనసాగుతున్న వరద ఉధృతి.. 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిదాటి ప్రవహిస్తున్న గోదావరి 

Dowleswaram Barrage: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ వద్ద గోదావరి ప్రస్థుత నీటిమట్టం 14.70 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్‌ ఫ్లో 14 లక్షల 42 వేల క్యూసెక్కులు ఉండగా రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే చింతూరు విలీన మండలాల్లో 120 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కాగా బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. లాంచీల సహాయంతో అధికారులు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. వరద ముప్పు ఎక్కువగా ఉన్న కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News