వికారాబాద్‌లో వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..
Vikarabad: బాబుపై గతంలో పలు కేసులు నమోదు
Vikarabad: వికారాబాద్‌లో జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలిని చేవెళ్లకు చెందిన అనసూయగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు... షాక్‌కు గురయ్యే సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడిని సీరియల్ కిల్లర్ రామస్వామిగా గుర్తించారు. నాలుగు రోజులక్రితం అనసూయను చీరతో మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు బాబు అలియాస్ రామస్వామిపై గతంలోనూ ఐదు మర్డర్ కేసులున్నట్లు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు.
అయితే నిందితుడు ఒంటరి మహిళలలే టార్గెట్‌గా మర్డర్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనసూయ హత్య మాత్రం వివాహేతర సంబంధం కారణంగానే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం మృతురాలి కాళ్ల కడియాలు, చెవి దుద్దులతో నిందితుడు బాబు పరారయ్యాడు. కాగా గత నాలుగు రోజుల నుంచి పోలీసులకు సవాల్‌గా మారిన కేసును ఎట్టకేలకు ఛేదించారు.