Hyderabad: నేడు హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశం

* ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ * భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్

Update: 2021-09-04 11:52 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం (ఫోటో ది హన్స్ ఇండియా )

Hyderabad: భాగ్యనగరానికి మరో ఉపద్రవం రాబోతోంది మరో రెండు గంటల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, మలక్ పేట ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దాంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

భారీ వర్షం కురిసే చాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, హైటెక్ సిటి, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, అంబర్ పేటల్లో భారీ వర్షం పడింది. ముసారాంబాగ్ దగ్గర వరద నీటిలో బ్రిడ్జి మునిగింది. దాంతో అంబర్ పేట, ముసారాంబాగ్ మద్య రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News