Vaccination: వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేసిన వైద్య ఆరోగ్య శాఖ

Vaccination: కరోనా కట్టడికి రానున్న రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన

Update: 2021-04-08 02:41 GMT

కరోన వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Vaccination: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. అంతేకాదు.. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. అయితే కరోనా కట్టడికి రానున్న రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇక ఇప్పటికే కరోనాకు హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు అనాధ ఆశ్రమాలు, అనుమానం ఏరియాల్లో కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. అయితే వైద్యులు మాత్రం కరోనాను కట్టడి చేయాలంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటున్నారు. ఇక 15 రోజులుగా వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందంటున్నారు కింగ్‌కోటి డిస్ట్రిక్‌ హాస్పిటల్‌ RMO. అయితే వ్యాక్సిన్‌పై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదంటున్నారు వైద్యులు.

ఇక కరోనా లక్షణాలు ఉన్నవారికి కొవిడ్‌ పరీక్షలు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం పలు ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే కరోనా లక్షణాలు ఉన్నాయోమనని అనుమానం వచ్చి పరీక్షలు చేసుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మాత్రం కొవిడ్‌ పరీక్షలు చేయకుండా వేరే దగ్గరికి రిఫర్‌ చేస్తున్నారని రోగులు, రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. తాము చెప్పిన విషయాన్ని డాక్టర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఏదీ ఏమైనా.. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రతీ ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలంటున్నారు అధికారులు. అదేవిధంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే పక్క రాష్ట్రాల మాదిరిగా లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు వస్తాయంటున్నారు.

Tags:    

Similar News