TS Polling: తెలంగాణలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఘట్టం.. సాయంత్రం 6 గంటల వరకు 65శాతం పోలింగ్ నమోదు

TS Polling: 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు పోలింగ్ నిర్వహించిన ఈసీ

Update: 2024-05-13 15:15 GMT

TS Polling: తెలంగాణలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఘట్టం .. సాయంత్రం 6 గంటల వరకు 65శాతం పోలింగ్ నమోదు

TS Polling: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి 25 రోజుల పాటు సాగిన ప్రచారపర్వానికి ఫలితంగా.. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈరోజు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేశారు. అయితే.. దేశంలో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడుతలో తెలంగాణలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించగా.. కొన్ని చెదురు ముదురు ఘటనలు తప్ప అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది.

ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బూతులకు క్యూ కట్టారు. ఎండ కారణంగా.. ఉదయం పూట ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మధ్యాహ్నం సమయంలో కొంత సన్నగిల్లింది. కాగా.. పోలింగ్ ముగిసే చివరి గంటల్లో ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. దీంతో.. పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. 2019తో పోల్చితే ఈసారి ఎక్కువే పోల్ శాతం నమోదైంది. 2019లో 62.77 శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ శాతం 70 దాటనుంది. పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం 75 పర్సెంటేజ్ దాటింది. ఇంకా ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది. కాగా.. తెలంగాణలో సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News