Kalyana Lakshmi: గుడ్ న్యూస్..త్వరలోనే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
Kalyana Lakshmi: కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతుందో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Kalyana Lakshmi: కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతుందో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలంటూ సర్కార్ ను ప్రభుత్వం ఆదేశించింది.
ఈనెల 27 వరకు చెక్కుల పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని..త్వరగా పంపడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి కోర్టును కోరారు. కౌశిక్ రెడ్డి పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది కోర్టు. చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ల లబ్దిదారులకు రాష్ట్రం చెల్లించాల్సిన ఆర్థిక సహాయం అందజేస్తామని అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ జస్టిస్ ఎస్ నందాకు తెలిపారు.
లబ్దిదారులకు చెందిన 71 చెక్కులను లబ్దిదారులకు పంపించామని..చెక్కుల చెల్లుబాటు జూన్ 27తో కాకుండా ఆగస్టులో ముగుస్తుందని కోర్టుకు తెలిపారు. అంతేకాదు ఒక్క చెక్కు కూడా ల్యాప్ అవ్వగుండా ప్రభుత్వం జారీ చేసిన జీఓలలో పేర్కొన్న విధంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ఆర్థిక ప్రయోజనం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చెక్కుల పంపిణీ రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయడం లేదని జూన్ 27తో చెక్కుల గడువు ముగుస్తుందని పిటిషనర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాదించిన వాదనల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
కాగా పూర్తి వివరాలను సమర్పించేందుకు రెండు వారాల సమయం కోరింది రాష్ట్ర ప్రభుత్వం. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలు అర్హులైన లబ్దిదారులకు చెక్కుల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలను అందించడానికి ఇమ్రాన్ ఖాన్ తన వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కోరారు.