MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 4కు వాయిదా
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 4కు వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత వాదనలు వింటామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. అంతకుముందు..కవిత తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేదని.. అసలు ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అరుణ్‌పిళ్లై తొమ్మిసార్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కవిత పేరు చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదటి, సప్లిమెంటరీ చార్జ్‌షీట్లలో కవిత పేరు లేదన్నారు. మొదటి నుంచి కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నా కవితను అరెస్ట్ చేశారని వాదనలు వినిపించారు సింఘ్వీ. మరోవైపు.. కవిత బెయిల్ పిటిషన్ పై లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు వెల్లడించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 4కు వాయిదా వేసింది..