HANS Hyderabad Marathon: రెండు సెషన్స్‌లో ది హన్స్ ఇండియా ఆధ్వర్యంలో మారథాన్
HANS Hyderabad Marathon: హాజరుకానున్న మంత్రి మల్లారెడ్డి సహా పలువురు ప్రముఖులు
HANS Hyderabad Marathon: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని WHO ప్రకటించింది. కోవిడ్ తరువాతతో పోలిస్తే..ఆత్మహత్యల సంఖ్య చాలా రెట్లు పెరిగిందని తేల్చింది. 2021సంవత్సరంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 13 వేల ఆత్మహత్యలు జరిగాయని నివేదిక విడుదల చేసింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయమన్నది. అయితే, ఈ విషయంలో సామాజిక బాధ్యతతో మెలిగే ది హన్స్ మీడియా మరో బాధ్యతను భుజానికెత్తుకుంది. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ఈనెల 10న రెండు సెషన్స్‌లో మారథాన్‌ను నిర్వహించబోతోంది. సుమారు 5వేల మంది రన్నర్‌లు ఈ మారథాన్‌లో పాల్గొననున్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగే మారథాన్‌లో మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొననుండగా.. అదే రోజు గచ్చిబౌలి స్టేడియంలో 5కే, 10కే రన్ నిర్వహించబోతోంది.