Ponnam Prabhakar: గిరిజన తండాల్లో సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న పొన్నం

Update: 2024-08-29 11:50 GMT

Ponnam Prabhakar

Ponnam Prabhakar: గిరిజన తండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కాసేపు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అలరించారు. ఇందిరా గాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారని గుర్తు చేశారు పొన్నం. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

Tags:    

Similar News