Sircilla: యూట్యూబ్ వీడియోలను అనుకరించబోయి.. ప్రాణాలు కోల్పోయిన బాలుడు

Sircilla: యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఉరి వేసుకున్న ఉదయ్

Update: 2023-07-23 08:54 GMT

Sircilla: యూట్యూబ్ వీడియోలను అనుకరించబోయి.. ప్రాణాలు కోల్పోయిన బాలుడు 

Sircilla: ఓ బాలుడి సరదా అతడి ప్రాణాలను బలితీసుకుంది. యూట్యూబ్ వీడియోలును అనుకరించబోయి ఉరి బిగుసుకుని బాలుడు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాకు చెందిన ఉదయ్ స్థానిక పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఉదయ్ కు యూట్యూబ్ లో వచ్చే సరదా సన్నివేశాలు చూసే అలవాటు ఉంది.

రోజూలాగే సెల్ ఫోన్ చూస్తూ ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. బాలుడు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపులు బద్దలు గొట్టగా ఉదయ్ ఉరి వేసుకుని చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Tags:    

Similar News