Guvvala Balaraju: ఎమ్మెల్యే గువ్వల సమక్షంలోనే కొట్టుకున్న కార్యకర్తలు

Guvvala Balaraju: పోలీసులు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారని ఆరోపణ

Update: 2023-10-27 11:02 GMT

Guvvala Balaraju: ఎమ్మెల్యే గువ్వల సమక్షంలోనే కొట్టుకున్న కార్యకర్తలు

Guvvala Balaraju: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చిన్న చిన్న గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. మాచారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత రామచంద్రయ్య కాంగ్రెస్‌లో చేరాడు. రామచంద్రయ్యను తిరిగి బీఆర్ఎస్‌లోకి తీసుకు వచ్చేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన అనుచరులతో గ్రామంలోకి వెళ్లాడు. రామచంద్రయ్య ఇంటికి వెళ్లి కండువా కప్పడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకున్నది. రెండు వర్గాల కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. పరస్పర దాడుల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దు మణిగింది.

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలోనే తమపై దాడి చేశారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో ప్రచారం చేస్తున్న తమపై అకారణంగా దాడిచేశారంటున్నారు. ఘర్షణలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా బీఆర్‌ఎస్‌ నేతలకు మద్దతుగా నిలిచారని.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కార్యకర్త డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News