Telangana: రేపు సీఎంతో 16వ ఆర్థిక సంఘం భేటీ
Telangana: ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్న బృందం
Telangana: తెలంగాణలో ఇవాళ, రేపు 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటించనుంది. రేపు సీఎం, ఆర్థిక మంత్రితో ఫైనాన్స్ కమిషన్ సభ్యులు భేటీకానున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో.. ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను... దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను... పెంచాలని ఆర్థిక సంఘాన్ని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం 12:30కు ఆర్థిక సంఘం బృందం ప్రెస్‌మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.