TGS RTC: ప్రయాణికులు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
TGS RTC: ఏసీ బస్సు పాస్ చార్జీలు తగ్గింపు
TGS RTC: హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపికబురు అందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధరలను భారీగా తగ్గించింది.ఈ బస్ పాస్ తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఎసీ బస్సులతోపాటు ఈ-మెట్రో ఎక్స్ ప్రెస్,, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది.
హైదరాబాద్ నగర ప్రయాణికులు ఇక నుంచి తక్కువ ఛార్జీలతో ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. గతంలో ఏసీ బస్సు ఎక్కి ప్రయాణించాలంటే టికెట్ ధర చూసి భయపడే వారు. ప్రయాణికుల సౌకర్యార్ధం తెలంగాణ ఆర్టీసీ ఏసీ బస్సు పాస్ ఛార్జీలు తగ్గించింది. ఎలక్ర్టిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర 2530 రూపాయల నుంచి 1900 రూపాయలకు తగ్గించింది. 630 రూపాయలు తగ్గించింది.
గ్రీన్ మెట్రో బస్సు సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేయడానికి బస్సు పాస్ ధరలు తగ్గించినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ బస్ పాస్ తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. సికింద్రాబాద్-పటాన్ చెరువు, బాచుపల్లి-వేవ్ రాక్ మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించ వచ్చు. ఎయిర్‌పోర్ట్ మార్గంలో నడిచే పుష్ఫక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదని స్పష్టం ఆర్టీసీ వెల్లడించింది.
మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ వాడుతున్న ప్రయాణికులు 20 రూపాయలు కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని టీజీఎస్ ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో మెట్రో ఎక్కే ప్రయాణికులు ఏసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.