TET Notification: నేడు ఏపీలో టెట్ ఫలితాలు..తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలివే

Update: 2024-11-04 04:20 GMT

TET Notification: తెలంగాణ ప్రభుత్వం నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. దీనికోసం పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి ఏడాది రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందని ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించింది. ఒక టెట్ పూర్తయ్యింది. రెండో టెట్ కు నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి..జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటివరకే చెప్పింది. ఆ ప్రకారమే నేడు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది.

ప్రభుత్వ ప్లాన్ ప్రకారమే జనవరిలో ఆన్ లైన్ విధానంలో టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే మేలో జరిగిన తొలి టెట్ ను దాదాపు 2.35లక్షల మంది రాయగా.. వారిలో 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఈ మధ్య డీఎస్సీని నిర్వహించారు. రెండో టెట్ రాసే వారి సంఖ్య కొంత తగ్గవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

ఆన్ లైన్ పరీక్షలు ఒక్క రోజులో పూర్తి కావు. కనీసం పదిరోజుల సమయం పడుతుంది. అందువల్ల సంక్రాంతి ముందు లేదా తర్వాత అనేది ఇంకా వెల్లడించలేదు. టెట్ పేపర్ 1 కి డీఈడీ పూర్తి చేసినవారు అర్హులు. పేపర్ 2 కి మాత్రం బీఈడీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హలు అవుతారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ రావాలంటే కూడా టెట్ పాసై ఉండాలన్న రూల్ పెట్టడంతో వేలమంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయబోతున్నారు.

టెట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు పరీక్షలు జరిగాయి. అందువల్ల జనవరిలో జరిగేది పదవది అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆరుసార్లు టెట్ పరీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగబోయే టెట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

మరోవైపు ఏపీలో టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మంత్రినారాలోకేష్ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. అభ్యర్థులు ఈ ఫలితాలను aptet.apcfss.in వెబ్ సైట్లో చూసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిని 3,68,661 మంది రాసిన సంగతి తెలిసిందే. తర్వాత ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. తద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుంది.

Tags:    

Similar News