TS Assembly: ఇదేనా ప్రజాస్వామ్యం.. బారికేడ్లు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
TS Assembly: అసెంబ్లీలోనే ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం శోచనీయం
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభ నుంచి వాకౌట్ అనంతరం మీడియా పాయింట్ దగ్గర వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కంచెలు తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం... అసెంబ్లీలో కంచెలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. మార్షల్స్ బారికేడ్లు తీయకపోవడంతో మీడియా పాయింట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించి నిరసన తెలిపారు.
మీడియా పాయింట్‌లో మాట్లాడకూడదని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు అసెంబ్లీ సెక్యూరిటీ మార్షల్స్.అందుకు సంబంధించిన రాతపూర్వక ఆదేశాలు ఏమైనా ఉంటే చూయించాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ మౌఖికాదేశాలు ఇచ్చారని తెలిపారు మార్షల్స్. సభ లోపల మాట్లాడనివ్వకుండా.. బయటా మాట్లాడనివ్వకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోనే ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం శోచనీయం అని అన్నారు.
స్పీకర్‌తో మాట్లాడి బారికేడ్లు తీస్తామని వెళ్లిన అధికారులు.. అనుమతించబోమని స్పీకర్ చెప్పినట్టు తెలిపారు. దాంతో మీడియా పాయింట్ ముందే బైఠాయించి నిరసనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.