జనగామ జిల్లా కేంద్రంలో దళితులపై అమానుషం

* గణేష్ వాడ హనుమాన్ ఆలయంలోకి దళితులను అనుమతించని పూజారి * దేవాలయం ముందు దళితుల ఆందోళన * ఆలయ పూజారిపై ఫిర్యాదు చేసిన బాధితులు * పూజారి ఆంజనేయశర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2020-11-13 08:31 GMT

స్వాతంత్ర్యం వచ్చి 70 యేళ్లు పూర్తయ్యాయినా.. దళితుల పట్ల వివక్ష. అదే అమానుషం. దళితులంటే నేటికి చిన్నచూపే. వారికి నేటికి దళితులకు దేవాలయల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. దేవుడిని దర్శించుకునే భాగ్యం కల్పించడం లేదు. అంటరానితనాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయాలని ఎన్ని చట్టాలు తెచ్చిన కొంతమంది మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. అదే తీరుగా ప్రవర్తిస్తున్నారు..

జనగామ జిల్లా కేంద్రంలో దళితులపై అమానుషం చోటు చేసుకుంది. స్థానిక గణేష్ వాడ హనుమాన్ ఆలయంలో దళితులకు ఎంట్రీ లేదని.. లోపలికి అనుమతి ఇవ్వలేదు. దాంతో గేటు బయటి నుంచే వారిని గెంటివేశారు. దీంతో దేవాలయం ముందు దళితులు ఆందోళన చేపట్టారు. దేవాలయంలోకి వెళ్లేందుకు దళిత సంఘాలు ప్రయత్నించాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాధితులు ఆలయ పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూజారి ఆంజనేయ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News