కేటీఆర్‌కు మహిళ కమిషన్ నోటీసులు..

కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ట్విట్టర్ వేదికగా ఆయన సారీ చెప్పారు

Update: 2024-08-16 13:15 GMT

కేటీఆర్‌కు మహిళ కమిషన్ నోటీసులు..

Notice: మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్...ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 24న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు మహిళా కమిషన్ అభిప్రాయ పడింది. తెలంగాణ మహిళలను కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్....ఈ నెల 24న కేటీఆర్‌ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులిచ్చింది.

బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క ప్రశ్నించగా.. దానిపై కేటీఆర్ స్పందిస్తూ, బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు అభ్యంతరం లేదని అన్నారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ట్విట్టర్ వేదికగా ఆయన సారీ చెప్పారు.

Tags:    

Similar News