టీఆర్ఎస్ భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం ముగిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చలు జరిపారు. గ్రేటర్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేశారు. GHMC ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీహెచ్ఎంసీ డివిజన్ల బాధ్యత అప్పగించిన సీఎం కేసీఆర్ ప్రచార అస్త్రాలపై డైరెక్షన్ ఇఛ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని మార్చిపోవాలని నేతలకు సూచించారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతులు, అసంతృప్తులతో ఎలా వ్యవహరించాలి విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి ఏయే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలనే అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ నిశానిర్దేశం చేశారు.